గిరిజన చట్టాలను కచ్చితంగా అమలు చేస్తాం.
గిరిజనులు తమ సాంప్రదాయాలను కాపాడుకోవాలి.
ఆదివాసీలు ఉన్నత లక్ష్యం సాధించే దిశగా ముందుకు సాగాలి
**
ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా ఆగష్టు 09 : ఆదివాసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, గిరిజన చట్టాలను కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు.
ప్రపంచ ఆదివాసి దినోత్సవము సందర్భంగా శుక్రవారం ఐటిడిఏ ఏటూరు నాగారం కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., ఐటిడిఏ పి.ఓ. చిత్రా మిశ్రా, ఏ ఎస్ పి శివం ఉపాద్యాయ లతో కలసి శ్రీ కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ముందుగా ఏటూరునాగారంలోని బస్టాండు నుండి ఐటిడిఎ వరకు ర్యాలీ కొనసాగింది.
అనంతరం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయంలోని కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిరిజన భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను కలెక్టర్ ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా తొ కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అదివాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసులు అంటేనే మానవత్వం అని, తాను చదువుకున్న సమయంలో ఆదివాసి చట్టాలు గూర్చి పూర్తిగా తెలుసుకోవడం జరిగిందని అన్నారు. గిరిజనులు తమ సాంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజన చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు.
గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందని దీని ద్వారా గిరిజనులకు అందవలసిన పథకాలను అర్హులైన వారికి అందించడం జరుగుతుందని వివరించారు. వంద శాతం అన్ని పథకాలను అమలు చేస్తున్నామని, గిరిజన యువతి యువకులలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని, రానున్న రోజులలో ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం ఐటిడిఏ పరిధిలోని అన్ని ఆదివాసి గిరిజన గ్రామాలను సందర్శించి ఆయా ప్రాంతాల్లోని వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, గిరిజనులు పరిష్కరించడానికి కృషి చేస్తున్న అని అన్నారు. రానున్న నెల రోజుల కాలంలో ఐటీడీఏ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని, తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివాసి గిరిజనులు సహకరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఐటిడిఏ అధికారులు సిబ్బంది తనకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని తెలిపారు.
ఏ ఎస్ పి శివం ఉపాద్యాయ మాట్లాడుతు మీ అందరికీ న్యాయం చేయడానికి ఏదైనా సమస్య ఉంటే మీ అందరూ వెంటనే పోలీస్ లకు సంప్రదించ వచ్చని, లేదా పోలీస్ స్టేషన్ కు నేరుగా వచ్చి కలిసిన చో నేను కచ్చితంగా న్యాయం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థినీలు చేసిన ఆదివాసి నృత్యం అందరికీ ఆకట్టు కున్నాయి.
వేదిక పై కలెక్టర్, పి. ఓ. విద్యార్ధిని లతో కలసి నృత్యం చేశారు.
నాయకపోడు ఆదివాసి సంప్రదాయాల తొ లక్ష్మి దేవరాయ వేదిక ఆసిన్నమైనది.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కే. సత్యా పాల్ రెడ్డి, ఆదివాస సంఘ నాయకులు పట్నం ఉపేందర్, పొడం బాబు, చింత కృష్ణ, పులస బాలు, మైపతి సంతోష్, పోడి రత్నం, గొప్ప వీరయ్య, ఈ ఈ వీరభద్రమ్, డి. డి. పోచం, ఎస్ ఓ రాజ్ కుమార్,
ఎంపి డి ఓ లు, తహసీల్దార్లు, పీసా కోఆర్డినేటర్ ప్రభాకర్, మహిళలు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.