నా భర్తను నాకు అప్పగించండి

పెళ్లయిన 6 నెలలకి ఎడబాటు

అదనపు కట్నం కోసం ఫోన్లో బెదిరింపులు

పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో కాలయాపన

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 10 (ప్రజాబలం) ఖమ్మం పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని 6 నెలలకి పరారీలో ఉంటూ అదనపు కట్నం కోసం ఫోన్లో వేధిస్తున్న నా భర్తను నాకు అప్పగించమని ఓ మహిళ తన ఆవేదనను విలేకరుల ముందు వెల్లబుచ్చింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు మాట్లాడుతూ… మాది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పూదరి నాగేశ్వరరావు కూతురును. నన్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, జడలచింత గ్రామానికి చెందిన కళ్లెం నరసింహారావు కుమారుడు కళ్లెం సునీల్ తో డిసెంబర్ 8, 2023న కుల పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. పెళ్లయిన నెల రోజుల నుండి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టి ఇతర మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని 6 నెలలకే బయటకు వెళ్లిపోయి ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసిన కౌన్సిలింగ్ పేరుతో తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా అధికారులు స్పందించి నా భర్తను నాకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విలేకరుల సమావేశంలో తల్లి పూదరి రమ, మేనమామ గాలి రాము, మేనత్త గాలి రేవతి, పెదనాన్న కోసూరి వీరబాబు, అన్నయ్య మరీదు గోపి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking