ప్రజా సంక్షేమమే ధ్యేయం
రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్
మెదక్ ప్రజాబలం ఆగస్టు 10 న్యూస్:-
ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని, నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధిలో పాల్పంచుకుంటానని సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ లో తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు, నాయకుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అందరి సహకారంతో కాలాకల్ గ్రామ సర్పంచ్ నుండి రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఎదిగానన్నారు. తన రాజకీయ జీవితం మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ ముదిరాజ్ బిజెపి మండల అధ్యక్షుడు నరేంద్ర చారి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మన్నె సాయి ముదిరాజ్,బండ నాగరాజు యాదవ్, రవి,జగన్, సాయి గౌడ్, హేమంత్,ప్రజా ప్రతినిధులు ,మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు,ముదిరాజ్ సంఘం నాయకులు,గ్రామస్తులు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.