జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 10
హుజురాబాద్ మాజీ శాసన సభ్యుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధ ఆశ్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎర్ర వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశ్రమంలోనీ పిల్లలకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పసుపునూటి శివ,పరశురామ్,ప్రశాంత్,రాజు,అనిల్,కిరణ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.