నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం మండల నాయకులు వేముల సైదులు అన్నారు.
ఈరోజు కక్కిరేణి గ్రామంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులతో కలిసి మేడే కార్యక్రమం నిర్వహించిన అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య గారి 111వ జయంతి కార్యక్రమాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రజలే తన బిడ్డలనుకొని ప్రజాసేవ కోసం పిల్లల్ని సైతం కనకుండా కడవరకు నమ్మిన సిద్ధాంతం కొరకు పోరాడిన కమ్యూనిస్టు నాయకుడు అనీ
వారసత్వముగా గా వచ్చిన భూమిని సైతం ప్రజలకు పంచి పెట్టిన ప్రజా సేవకుడు ఎలాంటి ఆడంబరాలకు పోకుండా
సైకిల్ పై పార్లమెంట్ కీ వెళ్లి ప్రజా సమస్యల పై ప్రశ్నించిన ప్రజా గొంతుకగా నిలిచి నేటి సమాజంలో అడుగడుగునా అవినీతి కమ్ముకున్న సమాజంలో సుందరయ్య నీ లాంటి నేతలు ఎందరయ్య”అని ప్రశ్నించారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి కన్నేబోయిన యాదయ్య ,గ్రామ హామాలి సంఘం అధ్యక్షులు తెడ్ల బోర్ర య్య , వేముల వెంకన్న , కోళ్ల గణేష్ , నల్ల ముత్తయ్య , బేక్కంటి రమేష్ , సైదులు , నరసింహ తదితరులు పాల్గొన్నారు.