54వ డివిజన్‌ వీడిఓస్‌  కాలనీ నందు కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన నగర మేయర్‌ పునుకొల్లు నీరజ

ఖమ్మం ప్రతినిధి మార్చి 02 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్ వీడియోస్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన పూనకొల్లు నీరజ;ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని  నివారించదగ్గ అందత్వ రహిత రాష్ట్రం  దిశగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులపాటు  రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.   ప్రతి పేదవాడికి కంటి చూపు అందించాలని ఉద్దేశంతో జిల్లాలో 55 బృందాలను ఏర్పాటు చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.  దూరపు చూపు, దగ్గర చూపు పరీక్షలు ఉచితంగా చేయబడతాయని రీడింగ్ సైట్‌ సంబంధించిన కళ్లద్దాలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగపర్చుకొని తమ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలలో కంటి పరీక్షలు చేయించుకొని అవసరమైన కళ్లజోళ్లను పొందాలన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహార,  వైద్యులు శిరీష, సూపర్‌వైజర్‌ వెంకటేశ్వర్లు, సంధ్యారాణి, స్పెషల్‌ ఆఫీసర్‌. శ్రీనివాస్‌, బత్తుల మురళి,  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking