గూడ అంజన్న యాదిలో మహా సభ పోస్టర్లు ఆవిష్కరణ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లోనిస్థానిక మార్కెట్ యార్డ్ లో గూడ అంజన్న యాదిలో మాహా సభ పోస్టర్లు గురువారం ఆవిష్కరించారు.ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,మండల కార్యదర్శి మేదరి దేవవరం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ…గూడ అంజన్న యాదిలో మార్చి 5న ఊరు మనదిరా… వాడ మనది రా అనే పోరుబాట నీరాజనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న బారీ బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ,యుద్ద నౌక గద్దర్, కళాకారులు మిట్టపల్లి సురేందర్, వందేమాతరం శ్రీనివాస్, విప్లవా చిత్రాల హీరో ఆర్ నారాయణ మూర్తి,రాంబాబు,తెలు విజయ, జయరాజ్, కోదండ రామ్, మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారన్నారు. కళాకారుడు గూడ అంజన్న మరణం తీరని లోటని,కళాకారుడు అంజన్న యాదిలో జరిగే బహిరంగ సభలో ప్రముఖులు తెలంగాణలో జరుగుతున్న వివక్ష, అణిచివేత పై వివరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు దేవి పోచన్న,కేతిరెడ్డి రమణారెడ్డి, గాజుల రవికుమార్,తిప్పని సత్తన్న, బైరి రాజన్న,చింతల ఐలయ్య, చింతల సత్తన్న,బానయ్య, వెంకటేష్,కుమార్,బానుచెందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking