ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 28:
మందమర్రి ఏరియాలోని సింగరేణి హై స్కూలు గ్రౌండ్ లో డబ్ల్యూ పి ఎస్ అండ్ జి ఏ ఆధ్వర్యంలో 60వ వార్షిక క్రీడలలో భాగంగా నియర్ బై ఫుట్ బాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈపోటీలకు ముఖ్య అతిధులుగా కే.కే డిస్పెన్సరీ ఇంచార్జ్ నాగేశ్వర్రావు, ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సర్యనారాయణ లు పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ సి అండ్ ఎం.డి బలరాం నాయక్ ఆదేశాల మేరకు సింగరేణి ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు, కళాకారులు కోల్ ఇండియా స్థాయిలో ప్రతి సంవత్సరం ఎన్నో బహుమతులు సాధించి సింగరేణికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారని వారు పేర్కొన్నారు. సీనియర్ క్రీడాకారులు సంస్థలు పనిచేస్తున్న యువ ఉద్యోగులను క్రీడల వైపు ప్రోత్సహించాలని అన్నారు. ఈ క్రీడలు మానసిక ఉల్లాసానికే కాక శరీర దృఢత్వానికి తోడ్పడతాయని వారన్నారు. ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధికి దోహదం చేసిన వారవుతారని వారన్నారు. ఈ కార్యక్రమమంలో అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, ఏఐటీయూస్ సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్, బాణయ్య, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎస్ శివ కృష్ణ, జనరల్ క్యాప్టెన్ శాఖ శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.