రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల లో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ తోటకూరి శివయ్య
ఇల్లందు ప్రతినిధి అక్టోబర్ 28 (ప్రజాబలం) ఇల్లందు తాను అధికారంలో ఉన్నా లేకున్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నా శ్రీనన్నా అంటే నేనున్నానంటూ ముందుకు వచ్చి కార్యకర్తలు ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే మహా వ్యక్తి పొంగులేటి శ్రీనన్న అని డిసిసిపి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మ దినం ను పురస్కరించుకొని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కామేపల్లి మండలంలోజన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేపల్లి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు పండ్లు, పంపిణీ కార్యక్రమం మరియు తాళ్లగూడెంలోని మార్త వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం భారీ కేక్ కట్ చేసి, ఆనందోత్సాహాల మధ్య కార్యకర్తలకు, అభిమానులకు నాయకులకు స్వీట్లు పంచి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్, జిల్లా తెలుగుదేశం నాయకులు తోటకూరి శివయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన భారీ అవినీతి వల్ల, ఇష్టా రాజ్యపు కుటుంబ పరిపాలన, నియంతృత్వ పోకడల వలన గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అభివృద్ధి కంటే మూడు లక్షల మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ నేడు ఎంతో వెనకబడిపోయింది. నిరుద్యోగుల శాతం పేదరిక శాతం పెరిగిపోయింది, గత పది ఏళ్ల నుండి పేదలకు రేషన్ కార్డులు ఇండ్లు జీవనోపాధి లేక వలస పోతున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి పొంగులేటి శ్రీనన్న అని, భారతదేశంలో ఏ వ్యక్తి చేయని విధంగా చాలెంజ్ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలలో కూడా తన ప్రభావంతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, ప్రభుత్వం ఎంత ఆర్థిక భారం ఉన్నా, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని తెలంగాణకు ఒక దిక్సూచిగా పేద ప్రజల ఆశాజ్యోతిగా, పొంగులేటి శీనన్న చిరస్థాయిగా పేద ప్రజల ఆశాజ్యోతి గా నిలిచిపోతారని హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్.కె పతే మహమ్మద్,డా. నెల్లూరి చందన, పాస్టర్ జాన్సన్ మండల నాయకులు దొడ్డిగర్ల సుందరం, భానోత్ నరసింహ నాయక్, మేకపోతుల మహేష్ మేకల మల్లికార్జునరావు, శీలం పుల్లయ్య, ఎస్.కె రబ్బానీ పాషా మేకల మహేష్ బాబు, పల్లె వెంకట్రాములు,అంబడి పూడి సత్యనారాయణ భూక్యా నాగేంద్రబాబు పాటిబండ్ల ప్రసాద్, భూక్య సుమన్ బండి లక్ష్మీనర్స్,బండి ఎల్లయ్య, దొడ్డ వెంకన్న చింతల వెంకయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు, చల్ల మల్లయ్య ఇట్టా శీను కోల వెంకటేశ్వర్లు, మల్లెంపాటి అప్పారావు బొడ్డు లక్ష్మీనారాయణ గుగులోత్ రవి, భూక్య సుమన్ తదితరులు పాల్గొన్నారు
