కాంపెల్లి సమ్మయ్యను సత్కరించిన సి.అండ్ ఎం.డి ఎన్.బలరాం నాయక్

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 28:

హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజెస్ ఆఫ్ ఇండియా లో సింగరేణి ఆధ్వర్యంలో పారిశ్రామిక సంబంధాలు సంస్థ అభివృద్ధి పర్సనల్ డెవలప్మెంట్ లీడర్ షిఫ్ క్వాలిటీస్ సేఫ్టీ ప్రొడక్షన్ అండ్ ప్రోడక్ట్ పై మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలో యూనియన్ ప్రతినిధులకు ఎక్స్టర్నల్ మరియు ఇంటర్నల్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించారు. ఆదివారం ముగింపు కార్యక్రమానికి సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్ లు చీఫ్ గెస్ట్ లుగా హాజరై కార్మిక నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.ఎన్.టి.యూ.సి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య ని సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం సర్టిఫికెట్ ప్రధానం చేసి శాలువాతో సత్కరించి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking