పి.వి.నరసింహ రావు సేవలు చిరస్మరణీయం

జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 23

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత ప్రధాని పి.వి నరసింహారావు వర్ధంతి కార్యక్రమంలో భాగంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని పి.వి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులుఅర్పించారు.నాయకులు మాట్లాడుతూ దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు పివి నరసింహారావు దక్షిణ భారతదేశం నుంచి తెలుగువారిగా ఈ దేశానికి సేవలు అందించిన మొట్టమొదటి ప్రధానిగా విశేష సేవలు అందించిన ఘనత పి.వి ది అని నాయకులు అన్నారు.ముఖ్యమంత్రిగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన ముఖ్యమంత్రి పదవి త్యాగం చేయాల్సి వస్తుందని తెలిసి కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి, ముఖ్యంగా భూసంస్కరణలతో లక్షలాది మంది పేదలకు భూములు అందేలా కృషి చేసిన గొప్ప చరిత్ర పీ వీ ది.
భారతదేశం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి గురైన సందర్భంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ చరిత్రలో గొప్పగా ఆర్థిక సంస్కరణలను అమలు చేసి, దేశ ఆర్థిక పరిస్థితుల్ని గాడిలో పెట్టిన గొప్ప చరిత్ర అని నాయకులు గుర్తు చేశారు. దేవి సేవల్ని వారి ఆలోచన విధానాలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని ముందు తరాలకు తెలియజేస్తామని యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు అన్నం ప్రవీణ్, జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు సాగర్, ప్రధాన కార్యదర్శి బీజిగిరి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పుల ప్రశాంత్, రాజేందర్, రాజు, జావిధ్, అంజి, రాజ్ కుమార్, అస్రఫ్, వంశీ, మహేష్, నభి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking