ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

రైతు కష్టాలు విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ అశ్విని

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ డిసెంబర్ 23 : విద్యార్థులు చిన్న నాటి నుండే రైతుల కష్టాలపై అవగాహన కలిగి ఉండాలని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ అశ్విని పేర్కొన్నారు. సోమవారం శ్రీ చైతన్య పాఠశాలలో రైతు కష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రులు, వారి కష్టాలు తెలుసు కున్నప్పుడే తమ గమ్యాన్ని నిర్దేశించు కుంటారున్నారు. కష్టం విలువ తెలిసిన వారు మాత్రమే ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా కష్ట పడుతారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking