హైదరాబాద్ సెప్టెంబర్ 13 ();జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, టైగర్ ఆర్. కృష్ణయ్య జన్మదిన వేడుకలు విద్యానగర్ లో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఉస్మానియా పరిశోదక విద్యార్ధి, బీసీ (టీ,టీఎల్,ఫ్)తెలంగాణా టీచర్స్ లెక్చరర్ ఫోరమ్,రాష్ట్ర కార్యదర్శి బాలస్వామి యాదవ్. శుభాకాంక్షలు తెలిపి,శాలువా తో సత్కరించారు. అనంతరం బాలస్వామి యాదవ్ మాట్లాడుతూ గత 40 సంవస్స్త్సరాలుగా బిసిల అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న పోరాట యోదుడు ఆర్. కృష్ణయ్య అని కొనియాడారు.బిసి విద్యార్థులకు హాస్టల్స్ , ఫీజు రేయంబాస్ మెంట్ కోసం ప్రభుత్వాలతో పోరాటం చేసి ఎన్నో జీఓ లు తీయించిన గోప్పనేత అని కొనియాడారు.