జగిత్యాల, ఎప్రిల్ 15: జగిత్యాల పట్టణం లోని రవీంద్ర ప్లే స్కూల్ లో ఘనంగా ” రంగోత్సవ్ 2K23 ” పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులకు కనువిందు చేసాయి.శివ తాండవం, ఆంజనేయ స్వామి కథ పౌరాణిక రూపం, విద్యార్థుల తల్లులు చేసిన నృత్యాలు, నర్సరీ పిల్లలు అమ్మ పాట పైన వారి తల్లులతో చేసిన నృత్యాలు అలరించాయి. ముఖ్యంగా ” తండ్రి – తనయులు” అనుబందం పైన చేసిన నాటిక చూపరులను ఆలోచింపచేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు సుమన్ రావు, శ్రీధర్ రావు, హరిచరన్ రావు, మౌనిక- హారి చరణ్ రావు,రజిత,కిషన్, రాజు తో పాటు పోషకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు