డా,,అంబేద్కర్ ను కించపరిచిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి,అంబేద్కర్ యువజన సంఘం పట్టణాధ్యక్షుడు కుమార్.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 : భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ను సోషల్ మీడియా వేదికగా కించపరుస్తూ దూషించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసులకు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సంఘం పట్టణాధ్యక్షుడు బోనగిరి కుమార్ మాట్లాడుతూ… విశ్వ విజ్ఞాని,అందరి సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ ను ఇద్దరూ వ్యక్తులు ఫేస్ బుక్ లో కించపరిస్తూ వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని విమర్శిస్తూ,మత కలహాలు రెచ్చగొట్టేలా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తుల పూర్తి వివరాలు,సంబంధిత ఆధారాలను పోలీసులకు అందజేశామన్నారు.అంబేద్కర్ సిద్ధాంతాలను,ఆశయాలను అర్ధం చేసుకోకుండా కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం తగదన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి పెండెం సతీష్,నాయకులు కండె మొగిలి,కోడి కుమార్,అభిలాష్,ఏం.కుమార్,అడ్లురి అక్షయ్, తొగరి రాజన్న,నంది తిరుపతి,ఏం.సందీప్ కుమార్,కే.కుమార్,అవునూరి వెంకటేష్,సందీప్ కుమార్,మహేందర్,శ్రవణ్, పోశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking