హస్తం గూటికి చేరిన బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్

కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెం ట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ లో కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘాల నేత, పివి రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని రాజ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్బంగా న్యాయవాదుల సంక్షేమనికి ఇండ్లస్థలలకు 20 ఎకరాలు, కమ్యూనిటీ హాల్కు , జూనియర్ న్యాయవాధులకు స్టైఫండ్ కు, హెల్త్ కార్డ్స్ 2లక్షల నుండి 5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిన సందర్బంగా న్యాయావాదుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ అద్వర్యంలో కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు . ఈ కార్యక్రమం లో టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాచకొండ ప్రభాకర్, పంజలా కుమార్, శ్రీధర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking