నారీ న్యాయ సమ్మేళనం నిర్వహించిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్.
ఖైరతాబాద్ ప్రజాబలం ప్రతినిధి:లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు కొరకు , రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు పుస్తకాల కవిత లు కలిసి నారీ న్యాయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబ మరియు దానం నాగేందర్ , ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ రెడ్డి విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ నేటీతో 5 రోజులు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ నాయకులు నాయకురాల్లు కార్యకర్తలు కష్టపడి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసే విధంగా ఓటర్లకు అవగహన కల్గించాలని అన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావ్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరూ సికింద్రాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ అత్యధిక మెజారీటీతో గెలిపించడానికి కృషి చేయాలని అన్నారు.