మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనీ, అచ్చే దిన్ ఆయెగా అని చెప్పి సచ్చేదిన్ తెచ్చిన బీ.జే.పీ నీ భూ స్థాపితం చేయాలి.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 09 మే 2024:
రైతు కూలీల నుండి ఆటో కార్మికులు, మహిళల నుండి విద్యార్థులు, రైతుల నుండి వృద్దుల వరకు ప్రతీ ఒక్కరినీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ 2024 లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలనీ, బీ.జే.పీ పాలనలో అచ్చేదిన్ కాదు ధరల పెరుగుదల తో సచ్చే దిన్ వచ్చిందని అందుకు కారణం అయిన బీ.జే.పీ నీ భూ స్థాపితం చేయాలని బీ.ఆర్.ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్య మంత్రి కే.సీ.ఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపు నివ్వడం, పర్యవసానంగా స్థానిక మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా వీధి వీధికి గడప గడపకు గురువారం రోజున తిరిగి ప్రజలకు కే.సీ.ఆర్ రాష్ట్ర సాధన సాదించిన తరవాత ప్రజా సంక్షేమ పథకాల అమలు పరచిన విధానాన్ని వివరించుతూ 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో విలువైన సమయాన్ని కేటాయించి ఈ.వీ.ఎం బ్యాల్లెట్లోనీ 1వ నంబర్ బీ.ఆర్.ఏస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకై కార్ గుర్తు బటన్ పై నొక్కి అమూల్యమైన ఓటును వేసి, ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో చేవెళ్ల నియోజక వర్గం నుండి పార్లమెంట్ కు పంపాలని, ఈ సందర్భముగా కార్ ను గెలుపు దిశగా ముందుకు సాగించడంలో సమయాన్నిచ్చి తోడ్పడుతున్న మాజీ ఎం.పీ.పీ తలారి మల్లేశ్ ముదిరాజ్, మణికొండ బీ.ఆర్.ఎస్. పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య, శైలజా వినోద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగల్ల ధనరాజ్, సీనియర్ అందె లక్ష్మణ్ రావు, సింగదాసరి ప్రకాశ్, లక్ష్మయ్య, రాజేంద్ర ప్రసాద్, గొరుకంటి విఠల్, గుట్టమీది నరేందర్, బాబు, బండమీది మల్లేశ్, యువ నాయకులు, మహిళా నాయకురాల్లు తది తరులు ముందున్నారని తెలియ చేయడం జరిగినది.

     

Leave A Reply

Your email address will not be published.

Breaking