నా కోసం ఐదు రోజులు కష్టపడండి…మీకోసంవచ్చే ఐదేళ్లు అందుబాటులో ఉంటా: సునీత

(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్) మే: 08 నా కోసం ఐదు రోజులు కష్టపడండి… వచ్చే ఐదేళ్లు మీకోసం 24 గంటలు అందుబాటులో ఉంటానని మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమె నియోజకవర్గo పరిధిలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధి ఫతేనగర్, బోయిన్ పల్లి డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి సునీత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బడి రమేష్ తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు తన గెలుపుకు బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా కూటమి 400 సీట్లు గెలుచుకొని రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పవనాలు బలంగా వీస్తున్నాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ పి. నాగిరెడ్డి, రమేష్, పుష్ప రెడ్డి, రమాదేవి, రాధా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking