టిడిపి జగిత్యాల నియోజకవర్గ కోఆర్డినేటర్ గా రాజన్న

 

జగిత్యాల, ఎప్రిల్ 1: తెలుగుదేశం పార్టీ జగిత్యాల నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా మహంకాళి రాజన్నను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా పనిచేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ నియామకం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి పూర్వవైభవాన్ని తేవాలని, గడప గడపకు టిడిపిని చేర్చడంలో పార్టీ శ్రేణులతో కలిసి కృషిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించినట్లు మహంకాళి రాజన్న పేర్కొన్నారు. తనపై ఎంతో విస్వాసంతో నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడికి ఇతర నాయకులకు రాజన్న కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి జగిత్యాల నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా మహంకాళి రాజన్న నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking