ఇల్లందకుంట ప్రజా బలం ప్రతినిధి ఏప్రిల్ 14
ఇల్లందకుంట మండల కేంద్రంలో గత 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైన శ్రీ రామ సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం రోజున శ్రీ రామ సాయి మానవసేవ చారిటబుల్ ట్రస్ట్ లో జరిగింది. శ్రీ రామ సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నూతన అధ్యక్షుడిగా ఎలిమిల్ల రాజేంద్రప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా బచ్చు శివకుమార్ కోశాధికారిగా మురికి మహేందర్ ఎన్నికైనట్లు అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎలిమిళ్ళ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైన శ్రీ రామ సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తూ వస్తుందని ఇకపై కూడా నూతన కమిటీ ఆధ్వర్యంలో ట్రస్టును మరింత అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకు వెళ్లడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. 12 సంవత్సరాల క్రితం దాసరి సాయిలు కోట్ల రూపాయల విలువైన మూడు ఎకరాల భూమిని వృద్ధుల ఆశ్రమం కొరకు విరాళంగా ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారని సాయిలు భౌతికంగా మన మధ్య లేకున్నప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఈ కమిటీ అహర్నిశలు కష్టపడి ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో దాతల సహకారంతో ఈ ట్రస్టును మరింత అభివృద్ధి చేస్తామని ఈ అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ ట్రస్ట్ నిర్వహణకు ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రావని కేవలం మానవత వాదులు దాతల సహకారంతో ఈ ట్రస్ట్ నడుస్తుందని ఇకపై కూడా దాతల సహకారంతో ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆశ్రమంలో 19 మంది వృద్ధులు ఉన్నారని వారి సంఖ్య మరింత పెరిగితే ఖర్చులకు కూడా ఇబ్బంది ఉండదని రాబోయే రోజుల్లో ఈ ట్రస్ట్ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేనేజింగ్ ట్రస్ట్ అయితే జనార్దన్ గౌరవ అధ్యక్షులు బచ్చు భాస్కర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ మరింత ముందుకు పోతుందని నమ్మకం మాకు ఉందని ట్రస్ట్ అభివృద్ధి కొరకు మేము నిరంతరం తమ సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ దాసరి సాయిలు ఏ ఉద్దేశంతో అయితే ఈ శ్రీ రామ సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు దానిని అతని ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా గణపతి రెడ్డి రావి కంటి బాబయ్య కాసర్ల మాధవరెడ్డి ప్రధాన కార్యదర్శిగా బచ్చు శివకుమార్ కోశాధికారిగా మురికి మహేందర్ జాయింట్ సెక్రటరీగా ముషం మధుసూదన్,యంసాని సుధాకర్,కాసం దేవదాసు లు ఉన్నారని వారు తెలిపారు. అంతేకాకుండా శ్రీ రామ సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి రాజమౌళి తెలిపారు.