నిర్మల్ సబ్ డివిజన్ కి ఎ.ఎస్.పి గా రాజేష్ మీనా ఐ.పి.ఎస్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ సబ్ డివిజన్ కి ఎ.ఎస్.పి గా నూతనంగా నియమితులైన రాజేష్ మీనా ఐ.పి.ఎస్.ఈ రోజు సబ్ డివిజన్ భాద్యతలు స్వీకరించి మర్యాద పూర్వకంగా జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఐ.పి.ఎస్ నీ కలవటం జరిగింది.
ఈ సందర్బంగా నిర్మల్ సబ్ డివిజన్ సమస్యలపై చర్చించటం జరిగింది. రాజేష్ మీనా ఐ.పి.ఎస్ గారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు, ఐఐటి జోద్పూర్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసారు. 2022 లో సివిల్స్ లో ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. ట్రైనింగ్ పూర్తీ చేసుకుని గ్రేహౌండ్ లో దళ కమాండర్ గా విదులు నిర్వర్తించి ఇప్పుడు నిర్మల్ సబ్ డివిజన్ ఎ.ఎస్.పి గా నియమితులైనారు

Leave A Reply

Your email address will not be published.

Breaking