ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 1

మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. ముందుగా పాత్రికేయుల సమక్షంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ కేక్ కట్ చేసి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను సభ్యులకు అందించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈకార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు బావండ్లపల్లి శ్రీనివాస్, కడారి శ్రీధర్, వాసాల లింగయ్య, ఎం.డి సలాముద్దీన్, జాడి ముకుందం, ఉప్పులేటి నరేష్, సకినాల శంకర్, సంతోష్, పల్లె సమ్మయ్య, కుర్రే శ్రీనివాస్, కున్సోత్ సంపత్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking