పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
ఖైరాతాబాద్ ప్రజాబలం ప్రతినిధి:బుధవారం నాడు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జానారెడ్డి వి. హనుమంతరావు మంత్రులు జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ బిర్లా ఐలయ్య రాజ్యసభ సభ్యులు ఏ అనిల్ కుమార్ యాదవ చైర్మన్లు శివసేనారెడ్డి సాయికుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆధునిక భారత స్వాప్నికుడు రాజీవ్ గాంధీ
శాంతి, స్వేచ్ఛ, సమానత్వం ద్వారా మానవాభివృద్ధిని సాధించవచ్చని ఐక్యరాజ్య సమితిలో రాజీవ్ గాంధీ ఇచ్చిన సందేశానికి ప్రపంచ దేశాధినేతల నుండి ప్రశంసలు వచ్చాయి
ప్రపంచాన్ని అరచేతిలో చుట్టేసేలా జీవితంలో కీలకంగా మారిన సెల్ ఫోన్ వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు
దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా మార్చాలనే ఉన్నతమైన ఆశయంతో చట్ట సవరణ చేసి ఓటు వేసే కనీస వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అత్యంత సన్నిహితుడు, ప్రేమాభిమానన్ని చూరగొన్న నాయకుడు మాజీ పీసీసీ హనుమంతు రావు
రాజీవ్ గాంధీ గారు నాటిన నాలాంటి మొక్కలు నేడు అగ్రనాయకులుగా కొనసాగుతున్నారు
రాజీవ్ గాంధీ గారిని స్మరించుకునే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించుకుంటున్నాం
రాష్ట్ర యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ గాంధీ పేరిట రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది

రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువతకు అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది
ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ, దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు, మాజీ ప్రధాని భారతరత్న శ్రీరాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ రెడ్డి శ్రీలతశ్రీనివాస్ యాదవ్ మహాలక్ష్మి రామన్ గౌడ్ లక్ష్మణ్ యాదవ.బొల్లు కిషన్ జగదీశ్వర్ రావు . రఘు పతి యాదగిరి గౌడ్ అప్సర్ యూసుఫ్ ఆది అవినాష్ శంభుల శ్రీకాంత్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు