అనుబంధాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి సోదరీమణులైన మహిళా నాయకులు, ప్రజా ప్రతినిధులు రాఖీ కట్టారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క , ఎంపీ కావ్య , ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి , రాగమయి , కార్పొరేషన్ చైర్ పర్సన్లు బండ్రు శోభారాణి , నేరెళ్ల శారద , కాల్వ సుజాత తో పాటు బ్రహ్మకుమారీలు ముఖ్యమంత్రి కి రాఖీ కట్టారు. వారందరికీ ముఖ్యమంత్రి పేరుపేరునా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
