జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తన కార్యాలయంలో కలిసి ప్రభుత్వ ఆసుపత్రులలో, మెడికల్ కళాశాలలో డాక్టర్లకు, మహిళా డాక్టర్లకు, నర్సింగ్ ఆఫీసర్లకు, ఆసుపత్రి సిబ్బందికి అవసరమైన భద్రత చర్యలను చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల కోల్కత్తాలో లేడీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో మహిళా డాక్టర్లకు నర్సింగ్ సిబ్బందికి ఆసుపత్రులతో పాటు, టీచింగ్ ఆసుపత్రులలో పనిచేస్తున్న సిబ్బంది కి రక్షణగా ఏర్పాట్లు చేయాలని మంత్రిని కోరారు. అందులో భాగంగా జీవో నెంబర్ 103 ప్రకారం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎస్ పి ఎఫ్ ఫోర్సుతో భద్రత ఏర్పాట్లను ప్రవేశపెట్టాలని ఈ వినతి పత్రంలో మంత్రిని కోరారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ ఎగైనెస్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్ – 2022 ప్రకారం ఆస్పత్రులలో భద్రతను కల్పించాలని మంత్రిని కోరారు. ఆస్పత్రులలో సీసీటీవీ, శిక్షణ కలిగిన సెక్యూరిటీ సిబ్బంది ని నియమించాలని మంత్రిని కోరారు. ఆస్పత్రుల్లో నియమించే కమిటీలలో జూనియర్ డాక్టర్లను సభ్యులుగా చేర్చాలని కోరారు.
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రం లోని అంశాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ కూలంకషంగా చర్చించారు. జూనియర్ డాక్టర్లు వెల్లడిరచిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు. జూనియర్ డాక్టర్లకు ఆసుపత్రిలోని వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి అవసరమైన భద్రతాపరమైన ఏర్పాట్లను చేపడతామని మంత్రి సందర్భంగా జూనియర్ డాక్టర్లకు తెలియజేశారు.
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అధ్యక్షులు డాక్టర్ కొమ్ము రాహుల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె ఇసాక్ న్యూటన్ చైర్పర్సన్ డాక్టర్ డి శ్రీనాథ్ ఉపాధ్యక్షులు డాక్టర్ సందీప్ అరోలా డాక్టర్ సందీప్ చారి డాక్టర్ అజయ్ ప్రకాష్ డాక్టర్ మోరే వంశీకృష్ణ డాక్టర్ వెంకటేష్ కుమార్ దుర్గం జూనియర్ మహిళ డాక్టర్లు మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.
Next Post