తెలంగాణ భవన్లో రాఖీ వేడుకలు

హాజరైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ భవన్‌ కి తరలివచ్చిన పార్టీ మహిళా శ్రేణులు
జూబ్లీహీల్స్‌ ప్రజాబలం ప్రతినిధి:రాఖి పండగను పురస్కరించుకొని తెలంగాణ భవన్‌ లో జరిగిన వేడుకలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు ఈరోజు కేటీఆర్‌ కు రాఖీ కట్టారు. పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, సీనియర్‌ నాయకురాళ్లు, మున్సిపల్‌ మహిళా చైర్మన్లు, కార్పొరేషన్‌ మహిళా చైర్మన్లు, కార్పొరేటర్లు, పలువురు పార్టీ కార్యకర్తలు కేటీఆర్‌ కి రాఖీలు కట్టారు.

 


రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. మా సోదరీమణి కవిత ఈ రాఖీ పౌర్ణమి పండగ రోజు తనకు రాఖీ కట్టే పరిస్థితి లేకపోవడం బాధాకరం, 155 రోజులుగా కవిత వేదన అనుభవిస్తున్నారో.. దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఉన్నదన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పండుగను పురస్కరించుకొని వచ్చి రాఖీ కట్టిన ప్రతి ఒక్క ఆడబిడ్డలకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking