బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం లో దొంగతనం కేసును కేవలం మూడు రోజుల్లో దొంగను పట్టుకున్న నిర్మల్ జిల్లాపోలీసులు
ఇచ్చిన మాట ప్రకారం దొంగతనం జరిగిన మూడు రోజుల్లోనే దొంగను పట్టుకున్న నిర్మల్ జిల్లా పోలీసులు.
బుధువారం గురువారం రాత్రి సమయం లో జ్ఞాన సరస్వతి దేవస్థానం లో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన బాసర పోలీసు సిబ్బంది.
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. కొసిడిగా సాయికుమార్.తండ్రి పేరు సాయిలు, వయసు 21 సంవత్సరములు , నివాసము నందిగావ్ గ్రామం,నవీపేట్ మండలం, నిజామాబాదు జిల్లా . అనేవాడు బుధువారం గురువారం రాత్రి సమయం లో అమ్మవారి దేవస్థానం లోకి జొరబడి ఉండి పగులకొట్టి 14200 సొమ్మును తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇట్టి దొంగతనన్ని చాలా సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఐపిఎస్ గారు స్వయంగా రంగం లోకి దిగి దేవస్థానం కి వెళ్లి అన్ని కోణాల్లో పరీక్షించి అవినాష్ కుమార్ ఐపిఎస్,ఏ ఎస్ పి భైంసా గారి నేతృత్వం లొ ముధోల్ ఇన్స్పెక్టర్ మల్లేష్, బాసర పోలీసు స్టేషన్ ఎస్ఐ గణేష్, మోహన్ సింగ్ కానిస్టేబుల్ మరియు కొంతమంది పోలీసు సిబ్బంది తో ఒక ప్రత్యేక టీం నీ ఏర్పాటు చేయటం జరిగింది. ఇట్టి టీం ఎస్పి మరియు ఏ ఎస్ పి ల సూచనలతో కేవలం రెండు రోజుల్లో సీసీటీవీ మరియు పోలీసు నూతన సాంకేతిక పరిజ్ఞానం తో దొంగని పట్టుకోవటం జరిగింది.
కేసు వివరాలు.
కొసిడిగా సాయికుమార్.తండ్రి పేరు సాయిలు, వయసు 21 సంవత్సరములు, నివాసము నందిగావ్ గ్రామం,నవీపేట్ మండలం, నిజామాబాదు జిల్లా అనువాడు తాగుడికి అలవాటు పడి సులభంగా డబ్బు పొందాలని ఆలోచన తో బుధువారం గురువారం రాత్రి సమయం లో బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి దేవస్థానం లో హుండీ పగులకొట్టి దొంగతనం చేసి 14200 సొత్తుని ఎత్తుకెళ్లినాడు
జిల్లా ఎస్పి ఏర్పాటు చేసిన ప్రత్యేక టీం మొదట సీసీటీవీ లొ రికార్డు అయిన ఫోటోలని కొత్త సాంకేతిక పరిజ్ఞానం తో అతని విజువల్స్ గుర్తుపట్టి అరెస్ట్ చేయటం జరిగింది. అతను నిన్నటి రోజు అనగా ఆదివారం 18 జులై రోజున నేరస్తుడు బాసర ఆలయ పరిసరాలలో ఎక్కువమంది ఉంటారని మల్లి ఏదైనా దొంగతనం చేదామని వస్తుండగా బాసర పోలీస్ లు పట్టుకొని చూడగా సీసీ ఫూటేజ్ లో ఉన్న వ్యక్తి నేరస్తుడు ఒకేలా ఉండటం గమనించి విచారించగ నేరం ఒప్పుకున్నాడు. అతని వివరాలు తెలుసుకునగా అతను ఆర్మూర్ లొ ఉండేవాడని,2 సవత్సరాల క్రిందట వివాహం చేసుకుని తన భార్య ఇల్లు అయినా నందిగావ్ గ్రామం, నవీపేట్ మండలం లో ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లో పని చేసి ఏ మధ్య అతన్ని విచారించగా దొంగతనాన్ని ఒప్పుకొని విలువైన రియల్ మీ ఫోన్ విలువ 6400, మరియు 6000 నగదు, తన వెంట తీసుకెళ్లిన వైట్ క్యారీ బ్యాగ్, నేరము చేసే సమయం లో వేసుకున్న ప్యాంటు, షర్ట్, టీ షర్ట్, షైన్ బైక్ ఏపీ25 ఏ ఏ 0552, మరియు హుండీ పగుల కొట్టడానికి ఉపయోగించిన రాయి సేకరించడం జరిగింది.
ఈ రోజు 19.08.2024 రిమాండ్ కి పంపటం జరుగును.
ఈ సందర్భంగా ఎస్పి డా.జానకి షర్మిల ఐపిఎస్ గారు భద్రత పరమైన లోపాల మీద మాట్లాడుతూ.
దేవస్థానం లో భద్రత పరమైన విషయం లో ఎటువంటి లోపాన్ని ఉపేక్షించవద్దని తెలిపారు,
ఇటీవల దేవస్థానం సందర్శించినప్పుడు చాలా లోపాలని పరిశీలించతం జరిగింది.
దేవస్థానం చుట్టూ చాల ప్రదేశాలలో సీసీటీవీ లు లేవు.సి సి టీవీ లు అనుసంసందానిస్తూ వీడియో వాల్ఉండాలి.
అన్ని సీసీటీవీలు కంట్రోల్ రూం లో అనుసంధానం అయ్యి ఒకదగ్గరనుండే చూసే విధంగా లేవు.కంట్రోల్ రూమ్ లో కూడా ఒక్క వ్యక్తీ మాత్రమే ఉన్నారు.
దేవస్థానం లోకి భక్తులు వచ్చే దారి కాకుండా చాలా ఖాళీ స్థలం ఎటువంటి కంచే లేకుండా ఉంది, అక్కడనుండి ఎవరైనా తేలికగా లోపలికి రావచ్చు.చుట్టూ గ్రిల్ల్స్ పటిష్టం చేయాల్సి ఉంది.
పైన తెలిపినవాణ్ణి సమకూర్చాలని మరియు కంట్రోల్ రూం లో 24 గంటలు నిఘా ఉండేలా మనవ వనరల్ని సమకూర్చుకోవాలి అని దేవస్థాన ఈఓ కు తెల్పటం జరిగింది.
ఈ కేసుని చేదించటం లో ప్రత్యేక చొరవ తీసుకున్న అవినాష్ కుమార్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ మోహన్ సింగ్ లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ప్రశంసించారు.