విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు..

మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం విద్యార్థులకు సకాలంలో అందించాలి

ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు

కౌడిపల్లి మండలం తునికి బీసీ పాఠశాల మరియు గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి / కౌడిపల్లి
19ఆగస్ట్ 2024 :

బీసీ పాఠశాల, కళాశాల ఉన్న ప్రతి విద్యార్థి సమగ్రాభివృద్ధికి అధికారులు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
కౌడిపల్లి మండలం తునికి బీసీ గురుకుల పాఠశాల మరియు కళాశాలను రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలోని తరగతి గదులు, వంట గది, భోజన శాల, డార్మెంటరీ లను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పాఠశాల, కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం నిర్దేశించిన మెన్యూ ప్రకారం పౌష్టికాహారాన్ని ప్రతి విద్యార్థికి అందించాలని, విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని సకాలంలో అందజేయాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై రెగ్యులర్ గా చెక్ అప్ చేయాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.


పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను అదనపు కలెక్టర్ పరీక్షించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరిబాబు తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking