ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. రమాదేవికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ముధోల్ బీఆర్ఎస్ ఇంచార్జీ పురాణం సతీష్, తదితరులు పాల్గొన్నారు.