క్రిస్టల్ CCH 999 పత్తి క్షేత్ర స్థాయి పరిశీలన

 

ప్రజాబలం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 : క్రిస్టల్ CCH 999 పత్తి క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించారు. అదిలాబాద్ మండలంలోని జంధపుర్ గ్రామంలోని PO దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమకి ముఖ్య అతిధిగా హాజరైన క్రిస్టల్ కంపెనీ టేర్రీటారి మేనేజర్ ప్రశాంత్ తో పాటు తిరుమల అగ్రో ఏజెన్సీస్ డీస్తుబ్యూటర్ గట్టు రాకేష్ సెట్,అభిరామ్ సీడ్స్ పోతన్న సెట్ చుట్టు పక్కల గ్రామాలు రైతులు సుమారు121 మంది రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టేర్రీటారి మేనేజర్ ప్రశాంత్ మాట్లాడుతూ…జందపుర్ గ్రామంలో నర్సయ్య చేనులో క్రిస్టల్ కంపెనీ CCH-999 అనే పత్తి విత్తనం గురించి క్రిస్టల్ కంపెనీ పత్తి విత్తనాలు నాణ్యమైనవని రైతుకు అధిక దిగుబడి తీసుకువచ్చే విధంగా క్రిస్టల్ కంపెనీ విత్తనాలను రూపొందిస్తుందని అన్నారు. క్రిస్టల్ కంపెనీ CCH-999 అనే వెరైటీ గురించి వివరిస్తూ,ఈ రకం ఎక్కువ ఎంపుగా పెరుగుతుంది,అధిక కొమ్మలు కల్గి ఉంటుంది,పెద్ద పెద్ద కాయలతో చిక్కటి కాపు,నాణ్యత పింజ, సస్యరక్షణ,ప్రత్తి తీయడం సులభంగా,పెద్ద పెద్ద కాయలు కలిగి ఉండటం వల్ల రైతు కూలీల ఖర్చు ఆదా,అంతేకాకుండా ఇలా పెద్ద పెద్ద కాయలు వుండటం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది,అంతేకాకుండా ఈ రకం సీడ్స్ అన్ని రకాల చీడ పిండాలు నుండి తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది అని ప్రశాంత్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలంలోని 4 గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking