100% పోలింగ్ సాధనే లక్ష్యంగా ఎలక్టోరల్ లిటరసి క్లబ్ సభ్యుల భాగస్వామ్యం…

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా ,

తెలంగాణ రాష్ట్ర శాసన సభ సాధారణ ఎన్నికలలో 100 శాతం పోలింగ్ సాధించాలనే లక్ష్యంతో సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని విసి హాల్ లో ,స్వీప్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఎలక్టోరల్ లిటరసి ‘క్లబ్ సభ్యులను భాగస్వామ్యం చేయాలని “విద్యార్థి హామీ పత్రం”ను రూపొందించడం జరిగింది .

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ,జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తో కలిసి భవిష్యత్ ఓటర్ల ,యువ ఓటర్ల హామీ పత్రమును జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నిక అధికారి కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వారి యొక్క తల్లి దండ్రులకు, మరియు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలింగ్ 100% జరిగే విధంగా భాగస్వాములుగా చేయాలని , త్వరలో ఈ హామీ పత్రాలను ఉన్నత పాఠశాలలకు, కళాశాలలకు అందజేయాలని , సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ , ఎలక్టోరల్ లిటలిసి క్లబ్, నోడల్ అధికారులు ,విద్యార్థులకు అందజేసి వారి చే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , DRO పద్మ శ్రీ, ఆర్డీఓ లు అంబదాసు రాజేశ్వర్, శ్రీనివాస్, స్పీప్ నోడల్ అధికారులు రాజి రెడ్డి, బ్రహ్మ , ఎన్నికల నోడల్ అధికారులు రాధికేషన్, విజయలక్ష్మిల సాయిలు, రవిప్రకాష్, శ్రీనివాస్, AO యూనస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking