అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి: సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్
పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
*సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి
*రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిణ.
వరంగల్ ప్రజాబలం అక్టోబర్ 30:
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఆదేశించారు.
సోమవారం న్యూ ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారు లతో కలిసి పాల్గొనగా, జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య , తూర్పు నియోజక వర్గం రిటరింగ్ అదికారి గా మునిసిపల్ కమైషనర్ రిజ్వన్ బాషా, వర్ధన్నపేట రిటర్నింగ్ అదికారి గా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే నర్సంపేట్ నియోజక వర్గం రిటర్నింగ్ అదికారి గా నర్సంపేట్ ఆర్డీవో కృష్ణవేణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా
సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ, నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలని అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు .
పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.
మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు. రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను వరుస క్రమం ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అన్నారు.
ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతి రోజు వచ్చే ఆప్యాల్ పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష..
వీడియో కాన్ఫరెన్స్ ఆనంతరం జిల్లాలో నియమించిన వివిధ ఎన్నికల ఎంసిసి., వివిటి. విఎస్‌టి. ఎస్‌ఎస్‌టి.,ఎఫ్‌ఎస్‌టి., టీమ్ లతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య సమీక్షించారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ నామినేషన్లు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నందున , ముందస్తుగా ఎన్నికల సిబ్బందికి నిర్వహణలో బాగంగా మూడు నియోజక వర్గాల మొత్తం సిబ్బంది 2036 కాగా 106 వర్ధన్నపేట తూర్పు నియోజక వర్గంలో లాల్ బహదూర్ కాలేజీ లో ,103- నర్సంపేట లోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టక్నాలజీలో,107- వర్ధన్నపేట నియోజక వర్గం లో వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ లో ట్రైనింగ్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు వారు అన్నారు.
నామినేషన్ల స్వీకరణ డిజిటల్ గడియారం ఏర్పాటు చేయాలని, నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థి తో సహా 5 గురు సభ్యులు మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోనికి అనుమతి కలదని, నామినేషన్లు సమర్పించుటకు అభ్యర్థి వాహనంతో పాటు రెండు వాహనాలకు మాత్రమే అనుమతి కలదని, అభ్యర్థి కాన్యయ్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల మేరకు అనుమతి కలదని ఎన్నికల నిబంధనలు తూచ తప్పకుండ రిటర్నింగ్ అధికారులు పాటించాలని, నామినేషన్ల స్వీకరణ డిజిటల్ గడియారం ఏర్పాటు చేయాలని, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం సి సి నోడల్ అధికారి పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ బాలకృష, ఎన్నికల ఖర్చుల నోడల్ అధికారి పుష్పలత, జిల్లా కొ-ఆపరేటివ్ అధికారి సంజీవ రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్,ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజ్ కుమార్ ,ఎన్నికల సూపరిండెంట్ విశ్వ నారాయణ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.