సర్వేల్లో సత్తా చాటుతున్న రామన్ గౌడ్…

హైదరాబాద్ ఆగష్టు 31 ();ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిజెపి అధిష్టానం అత్యంత రహస్యంగా చేపడుతున్న సర్వేల్లో బిజెపి సీనియర్ నాయకులు గడ్డం రామన్ గౌడ్ దూసుకుపోతున్నట్లు సమాచారం. నగరానికి నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఏ పార్టీకైనా ముఖ్యమే. పైగా ఈ స్థానం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోదాయే. దీనితో కిషన్ రెడ్డి ,ఈ స్థానంపైప్రత్యేక దృష్టి పెట్టి, గెలిచే నాయకుడిని ఆచితూచి ఎన్నిక చేస్తున్నట్లు వినికిడి. ఈ నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల పైగా ఉన్న ఓటర్లలో ,గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి పార్టీ అన్ని తానై వెనుక నిలిచినా సాధించింది కేవలం 34 వేల 666(24.7) ఓట్లు మాత్రమే.. ఈ ఓటర్లలో సగానికి పైగా బీసీలు ఉండడంతో , బిఆర్ఎస్ అభ్యర్థికి వరుసగా కలిసి వస్తుంది. ఈ నాయకునికి చెక్ పెట్టాలంటే బిజెపి కూడా బీసీ అభ్యర్థిని పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో అధిష్టానం వరుసగా సర్వేలు చేపడుతుంది .ఈ సర్వేల్లో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అనుకూలుడు ,చురుకైన, ఆర్ఎస్ఎస్ పునాదులు కలిగిన రామన్ గౌడ్ పేరుని మెజారిటీ బిజెపి నాయకులు ,కార్యకర్తలు, చూపిస్తున్నట్లు తెలియ వచ్చింది. అధిష్టానం కూడా భార్య కార్పొరేటర్ గా ,తను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొనసాగుతుండడంతో ఇతని వైపే మొగ్గు చూపుతున్నట్లు పలువురు పార్టీ పెద్దలు తమ దగ్గరి నాయకులకు ఇండికేషన్ ఇస్తున్నారు .ఈ సంకేతాలతో ఇప్పటికె నియోజకవర్గంలోని చోటామోటా నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ,రామన్ గౌడ్ ని కలిసి అభినందిస్తున్నట్లు నియోజకవర్గంలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking