ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి ఇటీవల పండితాపురం లో జరిగిన రాజకీయ గొడవల నేపథ్యంలో బెయిల్ పై విడుదలైన మాజీజడ్పీటీసీ, డిసిసిబి డైరెక్టర్, పొంగులేటి ప్రధాన అనుచరుడు మేకల మల్లి బాబు యాదవ్ ను పండితాపురం లోని తన స్వగృహంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, బీసీ, ఎస్సీ ఎస్టీ సంఘాల, బిజెపి నాయకులు పరామర్శించారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వ విజయబాబు,
బల్లేపల్లి స్వతంత్ర కార్పొరేటర్ మలీదు జగన్. మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు.షేక్ ఫతేహమ్మద్,జిల్లా బీసీ సంఘం నాయకులు లిక్కి కృష్ణారావుయాదవ్ , పల్లెబోయిన చంద్రం యాదవ్ తదితరులు మాట్లాడుతూ …..మల్లి బాబు యాదవ్ బి ఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి, వందలాది కుటుంబాల టిఆర్ఎస్ పార్టీ నుండి వందలాది కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం వలన అధికార పార్టీ వారు జీర్ణించుకోలేక ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని దురుద్దేశంతో, మల్లి బాబు యాదవ్ ను ఇలాగే వదిలేస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని స్థానిక నాయకులు, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ప్రోత్సాహంతో ఘర్షణ సృష్టించి, తమ మీదికే దాడి చేశారని చెప్పడం చాలా దుర్మార్గమని, ఆ సమయంలో గ్రామంలో లేకున్నా సరే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడాన్ని తీవ్రంగా ఖండించారు.
తమకు ఇష్టమైన రాజకీయాల్ని చేసుకోకూడదా? రాజకీయంగా ఎదుర్కోచేతగాక అధికార గర్వంతో ఇలా తప్పుడు కేసులు బనాయించి ఎంతమందిని ఎన్నిసార్లు జైలుకు పంపిస్తారు అని ప్రశ్నించారు. ఇలాంటి అధికార దురహంకారానికి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అధికారులు పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారుఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు జాలె శ్రీను తిరుమల రావు, గుమ్మ సైదులు,గూదే భద్రయ్య, మల్లెబోయిన శ్రీనివాస్, పంపాద్రి, ప్రభాకర్, పాపయ్య, లింగయ్య, వంశీ,ప్రభాకర్ రమేషు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Prev Post