ఈనెల రెండున ఖమ్మం లో చెన్నై షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభం

ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి హాజరు

ముఖ్య అతిథులుగా మంత్రి పువ్వాడ ఎంపీలు

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 31 ( ప్రజాబలం) ఖమ్మం
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వస్త్ర ప్రపంచంలో తన కంటూ ప్రత్యేకత కలిగి ఉన్న దిగ్గజ వ్యాపార సంస్థ ది చెన్నై షాపింగ్‌ మాల్‌ తన 26 వ బ్రాంచీని ఖమ్మంలో ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది సెప్టెంబర్‌ 2వ తేదీన ప్రముఖ హీరోయిన్‌ కృతిశెట్టి చేతుల మీదుగా ఖమ్మం బైపాస్‌ రోడ్‌లోని కొత్త బస్టాండ్‌కు సమీపంలో తమ బ్రాంచీని ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు బ్రాంచీని ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో తొలుత జీన్స్‌ కార్నర్‌ తరువాత జేసీ బ్రదర్స్‌ ఆ తరువాత చెన్నై షాపింగ్‌ మాల్‌గా మారి వస్త్ర వ్యాపార రంగంలో తిరుగులేని దిగ్గజ సంస్థగా పేరుగాంచింది. కాగా సెప్టెంబర్‌ 2వ తేదీన జరిగే చెన్నై షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఎంపీలు నామ నాగేశ్వరరావు వద్దిరాజు రవిచంద్ర బండి పార్దసారధి రెడ్డి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ ఖమ్మం మేయర్‌ నీరజ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు
ఖమ్మం నగరంలో అలరిస్తున్న భారీ హోర్డింగులు
సెప్టెంబరు రెండో తేదీన ఘనంగా ప్రారంభం కానున్న ది చెన్నై షాపింగ్ మాల్ కు దాదాపు ఎర్పాట్లు పూర్తయ్యాయి. కాగా ఖమ్మం నగరంలో ప్రధాన కూడళ్లలో చెన్నై షాపింగ్ మాల్ భారీ హోర్డింగులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు అన్ని కూడళ్ళలో ఆకర్షణీయమైన కలర్ ఫుల్ హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking