పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 31 (ప్రజాబలం) ఖమ్మం పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు.నేటికీ కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్ట్ లతోనే సాగు నీరు సరఫరా అవుతుందని బీఆర్ఎస్ రాష్టానికి చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. మాయ మాటలతో బిజెపి బీఆర్ఎస్ మోస పూరిత ప్రకటనలతో తొమ్మిది ఏండ్లు కాలం ఏళ్ళదీశారని తెలిపారు.బూత్ స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లు ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. సెప్టెంబర్ 02& 03 తేదీలలో స్పెషల్ కార్యక్రమం కలదు ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో బూత్ లెవెల్ ఏజెంట్స్ సరి చూసుకోవాలని పత్రికా ముఖంగా కోరారు.అనంతరం ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఎలక్షన్ ఇంఛార్జి బొజ్జ సంధ్యారాణీ మాట్లాడుతూ…ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు కైవసం చేసుకోవాలని కోరారు.కర్ణాటక లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తుందని తెలంగాణలో కూడా మాట నిలబెట్టుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు, ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు శ్రీ మహ్మద్ జావేద్ , జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అద్యక్షురాలు దొబ్బల సౌజన్య,కార్పోరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, రాష్ట్ర మైనారిటీ నాయకులు బి యచ్ రబ్బానీ, ఏలూరి రవికుమార్, నల్లమల సత్యంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking