బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామాంజనేయులు

హైదరాబాద్ ఫిబ్రవరి 17 : బీసీ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కురుమ రామాంజనేయులు నియమితులైనారు.ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ బిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయ విధానాన్ని ఎత్తివేయాలని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్స్ కై పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదం తెలుపాలని డిమాండ్ చేసారు. తనపై గల నమ్మకం తో బీసీ ఉద్యోగ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను నియమించిన ఆర్.కృష్ణయ్య కు రామాంజనేయులు కృతఙ్ఞతలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking