గురుజాల రైస్ మిల్లులో రేషన్ బియ్యం దందా.

 

గ్రామాలలో రేషన్ బియ్యం కొని సన్న బియ్యం గా మారుస్తున్న ఘనుడు.

సివిల్ సప్లై , పోలీసులే అధికారులే నన్నేం చేయలేదని బరి తెగింపు

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 18 :
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాలలో రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వం పేదల కడుపు నింపడం కోసం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టించి సన్న బియ్యం గా మారుస్తు అదే ప్రజలకు సన్నబియంగా మారుస్తూ ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటున్న కాలు మీద కాలు వేసుకొని లక్షల రూపాయలు వెనుకేసుకుంటున్న ఘనుడు. సివిల్ సప్లై అధికారులు, పోలీస్ అధికారులు తనను ఏం చేయలేదనీ, మిగతావారు ఏం చేయగలరనే ధీమాతో బరితెగించి పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమ రేషన్ బియ్యం దంధాను జోరుగా కొనసాగిస్తున్న రవీంద్రుడి తీరే సపరేటు. ఇదేం పని అని ఎవరైనా నిలదీస్తే నీకేం పని అడగడానికి నువ్వెవరని బెదిరించడమే కాకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఎవరు వచ్చినా నన్నేం చేయలేరని మహా అయితే రేషన్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేస్తారని, గతంలో 600 క్వింటానులు రేషన్ బియ్యం పోయాయని మరో వెయ్యికింటన్లు పోతాయని అంతకుమించి ఏమవుతుందని అడిగిన వారిని బెదిరిస్తున్న వైనం. ఎవరైనా అడిగితే బిచ్చం వేసినట్లుగా డబ్బులు వేస్తాను పట్టుకొని మూసుకుని పోతారని తన అక్రమ సంపాదన వారికి పంచు తనని పబ్లిక్ గానే చెప్పుతు తన అక్రమాలను అందరికీ పంచుతున్న గణపాటి. గురజాల చుట్టుపక్కల ప్రాంతాలలో ఏజెంట్లను పెట్టుకొని టీవీఎస్ ఎక్సెల్ మోపేడ్ ల మీద రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని తన మిల్లుకు తరలిస్తూ రాత్రిళ్ళు వాటిని సన్నబియంగా మార్చి కిలో 60 రూపాయలకు అమ్ముతూ లక్షల రూపాయలను అక్రమంగా వెనకేసుకుంటున్నాడు. రైస్ మిల్లుకు బయట తాళం వేసి ఇంటిలో నుండి రైస్ మిల్లు లోకి ఉన్న ద్వారం ద్వారా రేషన్ బియ్యాన్ని సన్న బియ్యం గా మారుస్తూ గుట్టుచప్పుడు కాకుండా బయట మార్కెట్ కు తరలిస్తున్న నరసింహుడి రైస్ మిల్లు వ్యవహారం అందరికీ బహిర్గతమే. ఇకనైనా అధికారులు స్పందించి రేషన్ షాప్ బియ్యాన్ని పక్క దారి పట్టకుండా బియ్యం దందా చేస్తున్న వారిపై రైస్ మిల్లు పై అధికారులు చర్యలు తీసుకుంటారా, లేకా జిల్లా కలెక్టర్ దృష్టికి రేషన్ అక్రమ దందా వ్యవహారం వెళ్తే గాని చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..

Leave A Reply

Your email address will not be published.

Breaking