కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 18 : అభివృద్ధి,సంక్షేమం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని,విద్యా, వైద్యానికి ప్రాధాన్యతనిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…వరి ధాన్యం చివరి గింజ వరకు ఐకేపీ కేంద్రాల ద్వారా కొంటామన్నారు.ఎవరైనా వడ్లు కట్ చేసినట్లయితే తనకు తెలియజేయాలన్నారు. పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతో పాటు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ని అమలు చేస్తున్నామన్నారు.సంక్రాతి లోపు మరోరెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.వానాకాలం పంటనుండి రైతుభరోసా పథకం అమలు చేస్తామన్నారు.ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మళ్లీ వచ్చే పంటకు క్వింటాలు వారిదాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. మహిళా సాధికారత కోసం అన్ని పథకాలు మహిళల పేరిటనే ఇస్తామన్నారుఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నం మంగ,తహసీల్దార్ రాఘవేంద్ర రావు,ఎంపీడీవో నాగేశ్వర్,మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య,వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం,కౌన్సిలర్లు, చాతరాజు రాజన్న,రాందేని వెంకటేష్,లావుడ్య సురేష్ నాయక్,గుడిసెల లక్ష్మి, చింత సువర్ణ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎండీ ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమల రాజు,చుంచు రవి,గుత్తికొండ శ్రీధర్,రంజిత్ సింగ్,మాలేం చిన్నన్న,చిన్న వెంకటేష్,మడిపెల్లి స్వామి, బాణాల రమేష్,బియ్యల తిరుపతి,యువ నాయకుడు అంకతి శ్రీనివాస్,రాందేని చిన్న వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking