మెదక్ ఫిబ్రవరి 16 ప్రాజబలం న్యూస్:-బీఆర్ఎస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక కానున్న సందర్భంగా మున్నూరు కాపు సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యునిగా రెండోసారి అవకాశం కల్పించి మున్నూరు కాపులకు సముచితమైన గౌరవం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకు కాంగ్రెస్ సర్కార్ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్లు కేటాయించి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యునిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువక మండలి అధ్యక్షులు భోనగిరి శేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగభూషణం, పట్టణాధ్యక్షులు కొంగోటి గట్టేష్, గట్టమ్మ బస్తీ అధ్యక్షుడు కొంగటి మల్లేశం, జిల్లా, పట్టణ నాయకులు హర్కార్ మహిపాల్ గందె అనిల్, ఆకుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.