తూప్రాన్ లో కోర్టు ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డీవో

పుట్టకోట లోని హాస్టల్ భవనం పరిశీలన

కోర్టు భావన నిర్మాణానికి ఐదు ఎకరాల భూమి కేటాయింపు.

తూప్రాన్, జూన్, 27. ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ కు జూనియర్ సివిల్ కోర్టు మంజూరీ చేసిన సందర్భంగా కోర్టు ప్రాంగణం నిర్మాణం కొరకు పట్టణంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించుట జరుగుతుందనీ ఆర్డీవో జయ చంద్రా రెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం తాత్కాలిక భవనం కోసం పుట్టకోట సమీపంలోని పాత ప్రభుత్వ హాస్టల్ భావనాన్ని తాత్కాలికంగా కోర్టు వ్యవహారాలు కొనసాగించుటకు నిర్ణయించి డివిజన్ లోని వివిధ అధికారులు ప్రజా ప్రతినిధులు, స్థానిక లాయర్ల బృందం సమక్షంలో సమావేశం నిర్వహించి హాస్టల్ భవనాన్ని గురువారం పరిశీలించారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి , తూప్రాన్ మండల తహసిల్దార్ విజయలక్ష్మి,ఆర్ ఐ నాగరాజ్, స్థానిక మునిసిపల్ చైర్ పర్సన్ మామిడ్ల జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, మున్సిపాలిటీ కమిషనర్ కాజా మొయినుద్దీన్ ,
మున్సిపాలిటీ ఆర్ ఐ రమేష్, ఎస్సై శివానందం , మున్సిపాలిటీ కౌన్సిలర్లు న్యాయవాదులు శ్రీనివాస్, ,అశోక్
ప్రజా ప్రతినిధులు
అర్ అండ్ బి అధికారులు, స్థానిక పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking