జిల్లా కలెక్టర్ వి .పి.గౌతమ్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 8 (ప్రజాబలం) ఖమ్మం సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం ఈ నెల 3 న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్, స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్-1 ను సందర్శించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చెందిన సహాయక కేంద్రం, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ లను ఆయన పరిశీలించారు. దరఖాస్తుదారులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ఆయన అన్నారు. జిల్లాలో 122 మద్యం దుకాణాలకు గాను మంగళవారం నాటికి 26 దుకాణాలకు సంబంధించి 47 దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు. దరఖాస్తులు ఈ నెల 18 సాయంత్రం 6.00 గంటల వరకు అన్ని పని దినాలలో స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర రెడ్డి, ఎక్సైజ్ అధికారులు తదితరులు ఉన్నారు.