రెగ్యులర్ డీఈవో లను నియమించాలి

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరిన ఎస్టీయు నేతలు

జగిత్యాల, ఫిబ్రవరి 8: విద్యా వ్యవస్థ బలోపేతం కావాలంటే విద్యాశాఖను నియంత్రించే శాశ్వత ప్రాతిపదిక డీఈవో లు అవసరమని సత్వరమే రెగ్యులర్ డీఈవో లను నియమించాలని ఎస్టీయు జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరారు. గురువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎస్టీయు నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ లు
మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పది ఏండ్లు గడుస్తున్నా 26 జిల్లాలకు రెగ్యులర్ డీఈవోలు లేరని, 590 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక విద్యాశాఖలో పలు సమస్యలు పరిష్కారం కాక పర్యవేక్షన లోపిస్తున్నదన్నారు. హెడ్మాస్టర్ లే ఎంఈఓ లుగా అదనపు బాధ్యతలు చేపడుతుండడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి విద్యార్థికి పునాది లాంటి ప్రాథమిక విద్యాబ్యాస్యం బలోపేతానికి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని అందులో గణితం, తెలుగు, ఇంగ్లీష్, పీ.ఈ.టి లను తప్పనిసరిగా నియమించాలని కోరారు. అలాగే ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన టెట్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపి నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేసి ఖాళీ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వంతో చర్చించాలని వినతిపత్రం లో జీవన్ రెడ్డిని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking