“ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష” మూడవ రోజు: కాంగ్రెస్ పార్టీ సంఘీభావం

 

ఎస్సీ వర్గీకరణ వల్లే మాదిగలకు సమన్యాయం జరుగుతుంది.

….. నిర్మల జగ్గారెడ్డి (డిసిసి జిల్లా అధ్యక్షురాలు)

జనాభా దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సిన వాటా వారికి న్యాయబద్ధంగా దాక్కాల్సిందే.

….*మెయప్పన్ తమిళనాడు,*
” (ఉమ్మడి మెదక్ పార్లమెంటు ఇంచార్జీ, కాంగ్రెస్ పార్టీ)

కాలయాపన చేస్తే మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు”

…..*అబ్రహాం మాదిగ* (ఎం.ఎస్.పి. సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌)

సంగారెడ్డి సెప్టెంబర్ 11 ప్రజ బలం ప్రతినిది:
సామాజిక ఉద్యమాల పితామహుడు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం సంగారెడ్డి లోని సమతాస్థల్ వద్ద సెప్టెంబర్ 9నుంచి 22వరకు కొనసాగుతున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షలను సంగారెడ్డి జిల్లా MSP వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మూడవ రోజు నిరాహార దీక్షలను సంగారెడ్డి ఎమ్మెస్ పి జిల్లా కన్వీనర్‌ అబ్రహాం మాదిగ ప్రారంభించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటున్న బిజెపి కాలయాపన చేయకుండ సత్వరమే ప్రస్తుత ప్రత్యేక పార్లమెంటు సమావేశంలోనే బిల్లు పెట్టాలన్నారు. ఇలాగే కాలయాపన చేస్తే మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.
*• “త్వరలో మా ప్రభుత్వం వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తాం”
*: మెయప్పన్ తమిళనాడు,” (ఉమ్మడి మెదక్ పార్లమెంటు ఇంచార్జీ, కాంగ్రెస్ పార్టీ)
ఎమ్మార్పియస్ డిమాండ్ న్యాయమైనదే. జనాభా దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సిన వాటా వారికి న్యాయబద్ధంగా దాక్కాల్సిందే. అందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. త్వరలో మా ప్రభుత్వం వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తాం.
*ఎస్సీ వర్గీకరణ వల్లే మాదిగలకు సమన్యాయం జరుగుతుంది. *
: విజయ నిర్మల జగ్గారెడ్డి (DCCB కాంగ్రెస్ అధ్యక్షురాలు)
ఎస్సీ వర్గీకరణ వల్లే మాదిగలకు సమన్యాయం జరుగుతుందని DCCB కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ నిర్మల జగ్గారెడ్డి గారు పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ప్రస్తుత పార్లమెంటు సమావేశంలోనే చట్టబద్దత కల్పించాలని కొనసాగుతున్న మూడవరోజు రిలే నిరాహారదీక్షకు మద్దతు గా వచ్చి తమ సంఘీభావం తెలిపారు.
“కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోని, తమ చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలి”.
“ఎన్నార్” ప్రముఖ వాగ్గేయకారులు
మార్పు కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు
అనేకమార్లు వేదికల మీద తమ మద్దతును బహిరంగంగా ప్రకటించి, ఉద్యమంలో సైతం ప్రత్యక్షంగా పాల్గొన్న బిజేపి పార్టీ మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనీ, అందుకోసం ప్రస్తుత ప్రత్యేక పార్లమెంటు సమావేశంలోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ఈ దీక్ష శిభిరాన్ని సందర్శించిన పట్లోళ్ల సంజీవరెడ్డి AICC రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిత్తారి యాదగిరి రాష్ట్ర బేడ బుడగజంగాల ప్రచార కార్యదర్శి, సందగల్ల సునీల్ యూత్ కాంగ్రెస్ కొండాపూర్ మండల అధ్యక్షులు, తదితరులు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

ఇట్టి కార్యక్రమంలో బొర్ర బిక్షపతి మాదిగ MRPS జాతీయ అధికార ప్రతినిధి, మైసగళ్ళ బుఛ్చేంద్ర మాదిగ MRPS సంగారెడ్డి జిల్లా కన్వీనర్, అబ్రహం మాదిగ MSP సంగారెడ్డి జిల్లా కన్వీనర్, మాతంగి చిరంజీవి MRPS సంగారెడ్డి జిల్లా కో కన్వీనర్, సడాకుల కృష్ణ మాదిగ MSP రాష్ట్ర నాయకులు, పెద్దగీత మాదిగ MMS రాష్ట్ర నాయకులు, దేవులపల్లి మహేష్ మాదిగ MSF జిల్లా కన్వీనర్‌, గందగల్ల వీరయ్య మాదిగ MSP జిల్లా నాయకులు, ముక్కగల్ల బిక్షపతి మాదిగ MSP నాయకులు, కవిత మాదిగ MMS జిల్లా నాయకులు, సుకుమార్ మాదిగ జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు, అలిగె రాజు MRPS ఆందోల్ నియోజకవర్గ నాయకులు, ముత్తగల్ల రాజు MSP హత్నూర నాయకులు, కె. పల్లవి మాదిగ MMS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking