ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఈరోజు సనాతన హిందూ ధర్మంపై డీఎంకే నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుండి నగరేశ్వర్ వాడ శివాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మం వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది అది హిందూ ధర్మంలో భాగమే అటువంటి ధర్మాన్ని కోట్లాదిమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయ్ స్టాలిన్ మాట్లాడాడని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన,ఈ వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, సాధం అరవింద్, అయ్యన్న గారి రాజేందర్ తో పలువురు ప్రజాప్రతినిధులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.