ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా బియ్యం ఇతర సంక్షేమ పతకాల ద్వారా కేంద్రం పంపిణీ చేసే బియ్యం లో
ఫో ర్టిఫైడ్ బియ్యం కలపాలని నిర్ణయించిందని, అందుకు గాను సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి అధ్యక్షతన బాలా గంగాధర్ అధికారులకు అవగాహన కల్పించారు.
. పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు సప్లిమెంట్ లు కలపడాన్ని ఫోర్టిఫైడ్ అంటారని , అంటే ఆహారాన్ని బలవర్దకం చేయడమే ఫోర్టిఫైదర్ గా పరిగణిస్తారు అన్నారు.
బియ్యం ఇతర ఆహార ధాన్యాలలో ఫోర్తిఫైడ్ రైస్ కెన్నెల్స్ కలిపి సరఫరా చేయడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించ వచ్చని అన్నారు.ఈ సందర్భంగా ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత వైపు పయనిస్తుందని , దేశం లో ఆహార భద్రత సస్తిరమౌతున్న దశలో ఇక పై పౌష్టికాహార లోపం కూడా ఉండకూడదన్న లక్ష్యం తో అంగన్వాడీ.మధ్యాహ్న భోజనం, ప్రజా పంపిణీ బియ్యం ఇలా దశల వారీగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా బలవర్థ క ఆహారం సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందని 2024 నాటికి దేశ వ్యాప్తంగా ఈ బలవర్ధకమైన ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని సంకల్పించిందన్నారు. దీనికోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.