రాజన్న సిరిసిల్ల జిల్లా,
23 జులై 2024 ,
ప్రజాబలం ప్రతినిధిరాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి ఈరోజు నిరాహార దీక్షలు పాల్గొన్న వాళ్లు యేల్దండి దేవదాస్ , గాజుల నారాయణ , ఏనుగుల ఎల్లయ్య , సిరిసిల్ల రవి , ఎక్కలదేవి జగదీష్ , శ్రీగాద మైసయ్య , చేరాల అశోక్ , కోడం అశోక్ , బండారి అశోక్ , మ్యాన సత్యనారాయణ ఈ దీక్షలకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు , సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కురపాటి రమేష్ మద్దతు తెలియజేయడం జరిగింది*
ఈ సందర్భంగా చెరుపెల్లి సీతారాములు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత తొమ్మిది మాసాల నుంచి సంక్షోభంలో కూరుకపోయి కార్మికులకు , అసాములకు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ ఉపాధి కోల్పోయారు ఇప్పటికే పదిమంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది కానీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని సిరిసిల్ల నేతన్నలు ఏం పాపం చేశారన్నారు గత ప్రభుత్వ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఇంకా రెట్టింపు చేసి అమలు చేస్తున్నారు కానీ సిరిసిల్ల కు సంబంధించిన అన్ని పథకాలను తొలగించి నేతన్నలను ఇబ్బందులు పెడుతున్నదని ఈ కక్ష సాధింపు చర్య ప్రభుత్వం మానుకోవాలని 26 తారీకు లోపు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కరెంటు సమస్య సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెను శాపంగా మారిందని 10 హెచ్పి ల వరకు ఉచిత కరెంటు ఇచ్చి ఆ తర్వాత వాటికి నాలుగో కేటగిరి కింద 50 శాతం సబ్సిడీ కొనసాగించాలి బతుకమ్మ ఆర్డర్లు ఇవ్వాలి గత ప్రభుత్వంలో కొనసాగించినటువంటి ఆర్డర్లతోపాటు గతంలో కంటే ఎక్కువ ఆర్డర్ లు ఇవ్వాలి గత ప్రభుత్వం కొనసాగించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కొనసాగించాలని వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ సంక్షోబానికి బాధ్యత వహించాలన్నారు వస్త్ర పరిశ్రమకు విధించినటువంటి జీఎస్టీ రద్దు చేయాలి సిరిసిల్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బండి సంజయ్ పరిష్కరించాలన్నారు ఇక్కడ వారికి ఉపాధి కల్పించే విధంగా కేంద్రం నుంచి ఆర్డర్లు తీసుకురావాలి ఈరోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీలో సిరిసిల్ల ఎమ్మెల్యే గారు తారకరామారావు మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లవలసిన బాధ్యత ఆయనపై ఉన్నది టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి వీరి సమస్యలకు పరిష్కారానికి కృషి చేయాలి తప్ప వీర బ్రతుకులతోటి రాజకీయాలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు 26 లోపల సమస్య పరిష్కారం జరగకుంటే ఇంటికో వ్యక్తి చలో హైదరాబాద్ వచ్చి ధర్నా లో పాల్గొనాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మూషం రమేష్ , పంతం రవి , తాటిపాముల దామోదర్ , ఆడేపు భాస్కర్ , మండల సత్యం , కుమ్మరి కుంట కిషన్ , గోనె పరశురాములు , తదితరులు పాల్గొన్నారు