లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 23 : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి బదిలీ సహజమని లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్ అన్నారు. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఇన్నిరోజులు పనిచేసి బదిలీపై దండెపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న ఏ ఎస్సై రాజేందర్,పిసిలు రమేష్,రవిల వీడ్కోలు సమావేశంలో సిఐ మాట్లాడుతూ…ఈ ముగ్గురు పోలీసులు విధి నిరవానలో మంచి అంకితభావం సమయస్ఫూర్తితో మంచి సేవాలందించారని అభినందించారు.ఎక్కడ పని చేసిన అక్కడ అధికారులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారధిగా పనిచేసి మంచి గుర్తింపు పొందాలన్నారు. అనంతరం ఎస్సై సతీష్ తో కలిసి ముగ్గురిని శాలువాలతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై-2 తానాజీతో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.