రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 2023 సెప్టెంబర్ 04: ప్రజల సౌకర్యార్థం కొన్ని రకాల కేసులను వెంటనే పరిష్కరించడం కొరకు అప్పుడప్పుడు లోక్ అదాలత్‌లను నిర్వహిస్తుంటారు అందులో భాగంగానే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 9న నిర్వహించనున్నారు. ఇందులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు సాధారణముగా హెల్మెట్ ధరించక పోవడం, అతివేగం, రెడ్ లైట్‌ను పట్టించుకోకపోవడం, తప్పుడు దిశలో డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగించి డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్, కారు డ్రైవింగ్ సమయంలో సీట్ బెల్ట్ పెట్టక పోవడం వంటివి, లోక్ అదాలత్‌లో మీకు చలాన్‌ను మొత్తంగా మాఫీ చేయవచ్చు లేదా జరిమానాను తగ్గించవచ్చు, ఇందుకుగాను టోకెన్ రిజిస్ట్రేషన్ పొందడానికి అనుసరించాల్సిన దశల వారీ సూచనలను పాటిస్తూ చలాన్ డిజిటల్ కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోని సెప్టెంబరు 09న సమీపంలోని జిల్లా కోర్టుకు వెళ్ళండి.
1) https://nalsa.gov.in/లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2) ‘నేషనల్ లోక్ అదాలత్ 2023 టోకెన్ రిజిస్ట్రేషన్’ అనే ఎంపిక కోసం వెతికి తదుపరి పేజీకి మళ్లించడానికి నొక్కండి.
3) చలాన్ మాఫీ / సెటిల్‌మెంట్‌కు సంబంధించిన ఎంపికను కనుగొని క్లిక్ చేసి, తదుపరి పేజీకి వెళ్ళండి.
4) మీ వాహన నంబర్‌ను నమోదు చేసి మాఫీ చేయాలనుకునే లేదా సెటిల్ చేయాలనుకునే పెండింగ్‌లో ఉన్న అన్ని చలాన్‌లను విడి విడిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
